Total Pageviews

Tuesday, November 29, 2016

" జన్ ధన్ యోజన " (JAN DHAN YOJANA) పథకం సంపూర్ణంగా విజయ వంతం కావాలంటే ఏమి చేయాలి?


" జన్ ధన్ యోజన " (JAN DHAN YOJANA)    పథకం సంపూర్ణంగా విజయ వంతం కావాలంటే ఏమి చేయాలి?

1. రాజ్యాంగ పరమైన " విద్యా హక్కును " , సంపూర్ణంగా , మనః స్పూర్తిగా అమలు చేయాలి .

2. బ్యాంకు వ్యవహారాలపై , ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి .

3. కొన్ని బ్యాంకులను కలిపేయాలి . మరియు బ్యాంకుల బ్రాంచులను ప్రతి గ్రామం లో ఉండేటట్లు చోరువ తీసుకోవాలి .

4. బ్యాంకు ఆఫీసర్లు , సిబ్బంది ' కస్టమర్ ఫ్రెండ్లీ " గా వ్యవహ రించాలి .

5. ప్రజలకనుగునంగా , బ్యాంకుల సమయాలను మార్చాలి .

6. ప్రతి అకౌంట్ కు ,   నామినీని మ్యాన్డేటరీ చేయాలి . వారి పూర్తి అడ్రస్ లు ,  ' ఆధార్ కార్డు '  నెంబరును , ' పాన్ కార్డు ' నెంబర్ ను,  సెల్ నెంబర్లు రిజిస్టర్ చేయాలి మరియు  వీటిని అనుసంధానం చేయాలి . అనుకోని సంఘటనలు జరిగి నప్పుడు , ఎలాంటి కొర్రీలు లేకుండా , అకౌంట్ లోని బ్యాలన్స్ అమౌంట్ , నామినీకి చెల్లించే ఏర్పాటు చేయాలి . అప్పుడే మోసాలు జరుగ కుండా ,  నల్ల ధనం కూడ బెట్టకుండా , పన్నుల ఈగ వేతలు   లేకుండా  ఉంటాయి . 

7. ప్రజల సొమ్ముకు పూర్తి భద్రత కల్పించాలి .

8. సర్వీస్ చార్జీలను తగ్గించాలి . సర్వీస్ పన్నును పూర్తి గా ఎత్తి వేయాలి .

9. ప్రజలను మానసికంగా నగదు రహిత విధాన మార్పుకు సిద్ధం చేయాలి . ప్రజలకు , ముఖ్యంగా  గ్రామీణ ప్రజలకు నగదు అనేది , దీపానికి కందెన లాంటిది . 

10.నిరంత రాయంగా ఇంటర్ నెట్ ను అందించ గలగాలి . 

11. బ్యాంకింగ్ సర్వీసులు సులువుగా , ప్రజలకు అందుబాటులో ఉండాలి . 
బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయడం , ఏ .టి . ఎం . మెషీన్లు , స్వఇపింగ్ మెషీన్లు అధికంగా , అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలి .




అప్పుడు మాత్రమే " అర్ధ క్రాంతి " పధకం విజయ వంతం అవుతుంది .

Monday, November 28, 2016

THE BEST SOLUTION TO CONTROL THE 'BLACK MONEY' AND 'BENAMI ASSETS'

ONE OF THE BEST SOLUTION TO CONTROL THE 'BLACK MONEY' AND 'BENAMI ASSETS' AND TO INCREASE THE REVENUE IN THE FORM OF DIRECT TAXES AND INDIRECT TAXES ETC., MAKE IT AS A MANDATORY, TO HAVE "ONLY ONE BANK ACCOUNT'' ( ONE POST OFFICE SB ACCOUNT MAY BE ADDITIONAL) AND "ONLY ONE CELL NUMBER" FOR ONE PERSON, AS ONE PAN CARD,ONE DRIVING LICENSE, ONE PASS PORT , ONE VOTER CARD , ONE RATION CARD AND ONE AADHAR CARD ETC.

FURTHER, MAKE THE "BANK ACCOUNT" OR "POST OFFICE SB ACCOUNT" COMPULSORY FOR EACH AND EVERY PERSON OF THE INDIA . PEOPLE SHOULD HAVE A CHOICE TO SELECT ANY BANK . EITHER IT MAY BE NATIONALISED BANK, PRIVATE BANK OR FOREIGN BANK. PRIVATE AND FOREIGN BANKS MINIMUM BALANCES MUST BE REDUCED AS NATIONALISED BANKS. AND IN THE SAME WAY PEOPLE SHOULD HAVE A CHOICE TO SELECT ANY SERVICE PROVIDER. THERE MUST BE PORTABILITY TO CHANGE ONE BANK TO OTHER BANK AS AND WHEN THE CUSTOMERS FEEL..

www.sollutions2all.blog.com

IS IT POSSIBLE TO MAKE THE INDIA AS "BEGGARS FREE" COUNTRY?

Q: IS IT POSSIBLE   TO MAKE THE INDIA AS "BEGGARS FREE" COUNTRY?


A:Yes, It is possible.


"Do not give money to beggars, those who are able work  and do not encourage beggar life as a profession."


"If you have little knowledge, bring the notice of the respective governments to give food and shelter to the beggars"



"If you are in the power, provide felicities to the beggars with the available schemes or introduce new schemes and utilize their services where ever possible ,but never show pityness "


If we observe keenly, most of the beggars upper middle class income levels only. But they can not enjoy as rich. Because ,tomorrow they have to go for begging know. Because of easy money , several people entering into this field. If we can not  control ,country may loose the great man power. Whatever issue is there, first we should find the reasons. In the same way, in case of BEGGARS issue also, it is necessary to find the types ,reasons and problems. And  why the people are changing in to  begging field?. Then only ,  it is possible to find the solution to make INDIA as 'beggars free' country and also  to make the  genuine  Beggars more comfortable life.

Types of Beggars:

1.   In villages, during the festival seasons some beggar will come and collects, what the villagers give and they  come  again for the next year festivals. With these people, there is no problem and they will give some entertainment to the children and others and they  can not harm any one.
2.   In cities , we will find  several at  every nook and corner ,every bus stop ,every junction, every rail way station, every temple, every park every flyovers,  every function halls, every footpaths and every cinema halls etc.,. with these beggars  public are facing lot of problems because they can’t leave the people so easily in journey time. 
3.   There are some people. They are neither men nor women. They can’t leave any person, if they feel that the person having money, without picking some amount. Further, they can’t accept coins. They accept only Rs.10/- and above i.e., 100s,500s,1000s only. Some of the neutral genders  create lot of nuisance. 
4. Some of the brokers purely depending on  beggars.  
5.   We are seeing regularly  in the daily  news papers , TV channels and social Media's  that  some people are taking poor and un known children and engaging them for begging. 
6.   Some of the beggars are  cutting their body and begging money.
7.   Some of the beggars collect money by becoming as  GODS on the roads & streets, like that there are so many beggars are using different methods for the easy money.




Reasons to change as Beggars:

1.   Some people due to illiteracy,  feel it is their profession and do not feel any shame.
2.   Some people feel it is easy money to earn without any investment and  hard work.
3.   People customs & traditions and interests  at Temples etc., encouraging some people to become as beggars.
4.   Some people handicaps (deaf, dumb and blind etc.,),     diseased ,old age people and children (those who do not have kith & kin) , really  they are  not able to do work and/or able to earn money to live.
5.   There is no ban on beggars profession.
6.   Some people are coming from different villages, districts and states due to natural calamities  i.e., droughts, cyclones, earth quakes, Tsunami es etc.,

Problems with the beggars:

1.   People get irritation while in travelling to different places on important works and offices etc.
2.   People loose money and they may trouble after giving money, if they short money, some times.
3.   Traffic jams at the Junctions etc.
4.   They may spread diseases.
5.    If the people  encourages begging, country looses man power, productivity and their knowledge and arts can not be utilized.
6.   If the beggars are more ,it is a indication that the country is poor.


After analyzing  all  the  above types , reasons and problems due to beggars, now it is possible to find the solution.

Solution to find the real and genuine Beggars and control others:

1.   G.O. to be passed for  the ban of begging.
2.   Beggars must be identified with 'Aadhar  Card ' , 'Voter Card', 'Ration Card' and recorded their  names ,parents names and their sons and daughters names, cast religion, place, education ,financial status and reasons for begging.
3.   Make the sons and daughters responsible for their old age parents and make the parents responsible  for their children.
4.  Aadhar cards ,Ration cards and Arogya sree cards to be issued to each beggar and /or each family at their native place, if identified. Or else at any place as decided by the respective authorities.
5.   Counsel the beggars to change the begging system by explaining about their future and insult of begging.
6.   Educate the beggars and training to be provided in different arts in which they are interested at free of cost.
7.   Once they completed their training, finance to be provided at  nominal interest. Marketing to be undertaken for their products.
8.   Finally, real and genuine beggars like old age ,handy cap (deaf, dumb, blind etc.,) and diseased  suffering from serious cancer, HIV, TB etc., may be identified. For them govt. must provide shelter, food and clothes and others.
9.   Donors or rich people may send cash, cheques, drafts or food or clothes etc., at their interest to these shelters. For every rupee ,there should be a calculation and record. These amounts may be exempted 100%, u/s 80G, of income tax act,1961.

10.Some other steps may be taken at appropriate time, based on          people suggestions. 

Request: I am not against to the beggars, only my intention is to change their lives with bright future and make the INDIA as beggar less country, in the world. You can post your experiences , comments and suggestions etc., I am very much confident that one day all my ideas and suggestions will  be implemented.





ప్ర : CAN WE REDUCE PILE UP THE CASES IN COURTS? కోర్టులలో కేసులు పేరుక పోవడాన్ని తగ్గించ గలమా ?

ప్ర : CAN WE REDUCE PILE UP THE CASES IN COURTS?  కోర్టులలో  కేసులు పేరుక పోవడాన్ని  తగ్గించ గలమా ?


జ : "రాజ్యాంగాన్ని మనం నమ్ము కుంటే , రాజ్యాంగం మనల్ని రక్షిస్తుంది"

"ప్రజలకు  నేడు న్యాయ వ్యవస్థపై ఉన్నంత నమ్మకం, గౌరవం, ఆసక్తి  మరి దేనిమీద లేదు". నిజాయతీ పరులకు, అమాయకులకు, వృద్ధులకు,  పిల్లలకు మరియు  దేశానికి అధిక వివాదాలకు ముఖ్య  కారణాలు ప్రజల అవసరాలు, అవకాశాలు, అత్యాశలు, చట్టాలలో లొసుగులు, స్వార్ధం మొదలైనవి. ఆకారణంగానే  నేడు దేశంలో సామాజిక, సాంఘీక  , ఆర్ధిక అసమానతలు తాండ విస్తున్నాయి  .

"భారత రాజ్యాంగం ప్రకరణ 21 ప్రకారం ప్రజలందరికీ ఆత్మ గౌరవంతో, స్వేచ్చగా  జీవించే హక్కు వుంది."  ఆందుకని ,భారత  దేశంలో నివసించే వారందరికీ సమాన న్యాయం, సత్వర నిర్ణయాలు తీసుకుంటూ , ప్రజలందరికీ వారి వారి ప్రాంతీయ భాషల్లో రాజ్యంగంపై ,  చట్టాలపై  నిపుణులచేత  అవగాహనను కలుగ చేయాలి. నేరమన్నా ,చట్టమన్నా, కోర్టులన్నా కష్టం నష్టం   భయమనే భావనను కలుగ చేయాలి. టేక్నోలోజీని ఇంప్రూవ్ చేసి,   పెట్టి కేసులను డిలే చేయ  కుండా  బయటనే పరిష్కరించు కునే విధంగా మార్గాలు సుగమం చేసి నట్లవుతే, కోర్టులను పెంచాల్సిన అవసరం ఉండక పోవచ్చు. అంతే గాకుండా కోర్టులలో కేసులను కూడా తగ్గించ వచ్చు.

అలా కాకుండా పలుకుబడి వున్న వారికి, ధనికులకు ఒక న్యాయం, పేదలకు బడుగు జీవులకు మరొక న్యాయంగా  అమలు చేసి నట్లవుతే మరియు కేసులను సత్వరంగా పరిష్కరించ నట్లవుతే, ఇంటికి ఒక కోర్టును పెట్టినా కోర్టులు సరిపోక పోవచ్చు. కేసులు ఆరు కోట్లకు పెరిగి  పోవచ్చు.
అంతే కాకుండా నిజాయతీ పరులు, అమాయకులు జీవితాంతం తీవ్రంగా కష్ట పడాల్సి రావచ్చు.  నష్ట పోవాల్సి రావచ్చు.దాని వలన మరల సమాజం లో , దేశం లో అనాగారికతలు చోటు చేసు కోవచ్చు మరియు  దేశాభి వృద్ది కుంటు పడ వచ్చు.

సైనిక తిరుగు బాటు నుండి , స్వాతంత్య్రం  సిద్దించే వరకు - అనగా 1857 నుండి 1947 వరకు, సుమారుగా 90 సంవత్ష రాలు  పోరాడి  స్వాతంత్య్రం  సంపాదించుకుని  66 సంవత్ష రాలు  గడిచినా  నేడు నిరు పేదలు          (బి. పి.ఎల్.) మన దేశం లో 34 % శాతం  వున్నారంటే ఆశ్చర్యం  కలుగక మానదు. 

సూర్యుడు  వున్న  చోటే  వేడమి  వెలుతురూ వుంటుంది, చంద్రుడు వున్న చోటే వెలుతురూ చల్లదనం వుంటుంది.  పూలు ఉన్నచోటే  సువాసనలు అధికంగా ఉంటాయి. చెట్లు వున్న చోటే గాలి అధికంగా వుంటుంది. నీరున్న చోటే  అధికంగా ప్రాజెక్టులు వస్తాయి. ప్రజలు వున్న చోటే సమస్యలు అధికంగా ఉంటాయి. అది సహజం.సమస్యలకు  కారణాలు  అనేకం. కాని క్షణికావేశంలో మనం సృష్టించు కునేవే అధికంగా ఉంటాయి.మరోసారి పునరాలోచించుకుని  సమస్యలను బయట  పరిష్క రించు కుంటే  కోర్టులలో కేసులు చాలా వరకు తగ్గి పోతాయి.

భారత దేశం కళలకు , ఆచారాలకు, సాంప్రదాయాలకు  పుట్టినిల్లు. విశాలమైన భూమి మరియు   విశాలమయిన హృదయం గల మన భారత దేశంలో వివిధ రకాల మతాల వారు, కులాల వారు మరియు విదేశస్తులు కలిసిమెలిసి జీవించడానికి మన రాజ్యాంగం వీలు కల్పించింది. అందుకే మన దేశాన్ని "లౌఖిక రాజ్యమని (secular state)  అంటున్నాము . ప్రపంచం లో గొప్ప హృదయం గల దేశమంటే "భారత దేశమే".  భారతీయులుగా జన్మించడం మన అదృష్టం. వివిధ రకాల మతాలను బట్టి చట్టాలలో కూడా కొన్ని తేడాలు వున్నాయి. 

వివిధ రకాల ఆచారాలు ,సాంప్రదాయాలు,  జీవనవిధానంలో తేడాలున్నాయి. మనుష్యులలో ఆరోగ్యం గలవారు  అనారోగ్యం గల వారు, బలవంతులు  బలహీనులు, విద్యా వంతులు విద్య లేని వారు, ఆడవారు మగ వారు , వృద్ధులు పిల్లలు మొదలగు అనేక మంది  భారత దేశం లో నివశిస్తున్నారు. వీటికి  తోడూ, వాతావరణ  తేడాలు, ప్రాంతీయ  తేడాలు వున్నాయి. అంతే కాకుండా మానవులపై  కాల ప్రభావం, పరిస్తితుల ప్రభావం అధికంగా వుంటుంది. ఇన్ని రకాల కారణాల వలన ప్రజలలో సమస్యలు కూడా అధికంగానే వుంటాయి.

వాస్తవాలు:

1.నేడు భారతదేశ జనాభా సుమారు 126 కోట్లు.
2.ప్రస్తుతం 10 లక్షల జనాభాకు 15 మంది న్యాయ మూర్తులున్నారు.
3.జనాభా తోటే వివాదాలు పెరుగు తున్నాయి. 
4.భారత దేశంలోని అంచెలవారి విధానం వలన, దిగువ కోర్టుల
    నుండి సుప్రీం కోర్టు దాకా వెళ్లి పరిష్కారం కావడానికి ఒక్కో      
    కేసుకు  30 సంహత్స రాలు పడుతుంది.
5.దీని వలన కేసులు పేరుకొని పోయి , కోర్టులపై వత్తిడి
    పెరుగుతుంది.
6. ఈ వత్తిడి నుండి ఉప శమనంగానే 'లోక్ అదాలత్' ఏర్పడింది.
7. తదనంతరం 'లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం' ఏర్పడింది.
8.మనదేశం లో మధ్య వర్తిత్వానికి అంతగా ప్రాదాన్యత లభించడం
   లేదు.
9. భారత శిక్షా స్మృతిలో  మధ్య వర్తిత్వానికి అవకాశం కల్పించే
     నిభందన వుంది.
10. భారత దేశంలో నేడు 24 హైకోర్టులు వున్నాయి.

కేసులు పేరుక పోవడానికి కారణాలు:

1.జడ్జీల కొరత.
2.మౌలిక వసతులు లేక పోవడం.

3. న్యాయ వ్యవస్థలో  టెక్నాలజీ ని పూర్తిగా  వినియోగించుకోలేక  పోవడం. ముఖ్యంగా , కంప్యూటర్  పై పట్టు , నమ్మకం  లేక పోవడం .  డిజిటలైజేషన్ ను ఇంటర్ డ్యూస్ చేయక పోవడం .
3. లాయర్లు చిన్న చిన్న కారణాలు చూపి వాయిదాలు వేస్తూ కాలయాపన చేసుకుంటూ పోవడం.
4.కాలమే పరిస్కరిస్తుందనే దొరనితోనో, మరేదో కారణం తోనో కేసులను వాయిదా  వేయించు  కోవడం.
5. యేండ్ల తర బడి కాల యాపన  చేయడం వలన సాక్షులు మాట మార్చుతూ ఉండటం , సాక్షులు  అనారోగ్యం తో వుండటం లేదా మరణించడం.
6.నిర్దిష్ట  మైన గడువు లేక పోవడం, మొదలగు అనేక మైన కారణాల వలన కేసుల జాప్యం జరిగి లక్షల కొలది కేసులు పెండింగ్ లో    వుండి పోతున్నాయి . 

7. ఒక్కో సారి  మనకు  సంభందం  లేని కారణాల వలన , అనుకోని సంఘటనల వలన  కూడా  కేసులు  పోస్ట్పోన్  అవడానికి  అవకాశాలు  అధికంగా  ఉన్నాయి . 

కుటుంభ సమస్యల వలన , ఆర్ధిక అసమానతల వలన , ఆదర్శ   వంత మయిన, విలువలతో కూడిన  పాలకులు   లేక పోవడం   వల్లనే , నేడు కోర్టులలో కేసులు అధికంగా పెరిగి పోతున్నాయి.


మన న్యాయ మూర్తులు, మేధావులు , మన దేశం గురించి, సమాజం గురించి, అవి నీతి  పెరిగి పోవడాన్ని,     కోర్టులలో కేసులు పెరిగి పోవడం   గురించి ఎలా ఆవేదన చెందు తున్నారో, వారి మాటల్లోనే  చూద్దాం.

" ఇటీవల కాలం లో వైవాహిక జీవితాల్లో వివాద కేసులు బాగా పెరిగి పోతున్న పరిస్తితుల్లో వాటిని కోర్టుల బయట పరిష్క రించు కునేల  ఆహార భద్రతా, వ్యాపారం, మార్కెటింగ్ అవకాశాలు, సైన్స్ & టేక్తోనోలోజి రూపంలోనూ  వున్నాయని దేశంలో అంతర్గత ముఖ్యమని అన్నారు."(ఈనాడు 22.03.2013).

" కేసులను సత్వరం పరిష్కరించి ప్రజలకు న్యాయ వ్యవస్థ ఫై నమ్మకం పెంచాలని హైకోర్టు తాత్కాలిక న్యాయ మూర్తి పేర్కొన్నారు . లేదంటే కక్షి దారులు అసాంఘీక  శక్తులను ఆశ్రయిస్తారన్నారు. "(ఈనాడు 25.03.2013).
"అన్ని హక్కులకు మూలం సమానత్వం. సమానత్వం సాధించు కున్నప్పుడు హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాడాల్సిన అవసరం వుండదు. మానవ హక్కుల విలువ తెలుసుకోక పోవడం వల్లనే హక్కుల ఉల్లంగన జరుగు తుంది. ప్రపంచంలో మరే దేశంలో  లేనన్ని  చట్టాలు మన దేశంలో  వున్నాయని , కాని కొన్ని లోపాలు, లొసుగుల కారణంగా అవేవి అమలుకు నోచుకోడం లేదు అని లోకా యుక్తా అన్నారు." (ఈనాడు 30.03.2013)

"భక్తి పేరుతో  జంతువులు, పక్షుల్ని బలి ఇవ్వడాన్ని నిషేదిస్తూ చట్టం చేసినా  అమలు చేయక పోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమలు చేయనప్పుడు చట్టాలు చేయడం ఎందుకని ప్రశ్నించింది." ( ఈనాడు,02.04.2013).

"మధ్య పాన నిషేదానికి మహిళలు నడుం కట్టాలని , చట్టాలపై అవగాహన పెంచు కున్నప్పుడే పూర్తీ రక్షణ పొంద గల రని  రాష్ట్ర హైకోర్ట్ న్యాయమూర్తి అన్నారు." (ఈనాడు 07.04.2013)
"సమాజంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి.ఈ నేపధ్యంలో అవినీతి , అక్రమాలు, అన్యాయాలను ఎండగడుతూ రచనలు చేయాలి. సత్యంతో ఒక శక్తి వస్తుందనే విషయాన్ని తెలుసుకొని మున్డుకేల్లాలని రాష్ట్ర హైకోర్ట్ న్యాయమూర్తి అన్నారు." (ఈనాడు 09.04.2013)
 
 
పెండింగ్ కేసులను తగ్గించ డానికి ఐడియాలు

ప్రస్తుతమున్న మార్గాలు కొంతవరకు ఉపయోగ పడవచ్చు, కాని పూర్తిగా కాదు. అవి శాశ్విత మార్గాలు కానే కావు. గాయమొక  చోట వుంటే మందొక చోట పెడితే వివాదాలు ముదిరి, కేసులు పెరుగుతాయి తప్పా తగ్గవు.  
 
"దేశ మంటే మట్టి కాదోయ్ , దేశమంటే మనుష్యులోయ్" అని గురుజాడ గారు అన్నట్లు -- దేశమంటే మనుష్యులే. సమాజమన్నా మనుష్యులే. గ్రామ మన్నా మనుష్యులే.  అలానే కుటుంభ మన్నా మనుష్యులే కదా. అందుకని, "మానవ వికాసానికి, మానవాభి వృద్ధికి  , మానవ మానసిక వృద్ధికి, మానవ విజ్ఞ్యానానికి, మానవ ఉపాదికి అత్యధిక ప్రాదాన్యమిచ్చి, ఆర్ధిక అసమానతలను తొలగించి, వోటు బ్యాంకు సంక్షేమ పధకాలు మాని , ప్రజలను పేదలు గానే బ్రతకనివ్వాలి అనే ధోరణి మాని , నిస్వార్ధంగా,అన్ని రకాలుగా కుటుంభ వ్యవస్థను తీర్చి దిద్ది, విలువలను పెంపొందించి నట్లవుటే అసలు సమస్యలే వుండవు.  వ్యాజ్యాలే వుండవు."
కుటుంబంలో కొందరు అత్తా కోడన్లే అనేకమైన కుటుంభ సమస్యలకు కారణమౌతున్నారు. వీరికి తోడు భార్యా భర్తల కలహాలు, ఆస్తి పాస్తుల వ్యవహారాలు, మోసపూరిత వ్యవహారాలు ,  సమాజంలో విలువల క్షీణత అనేకమైన కోర్టు వ్యాజ్యాలకు కారణమౌతున్నాయి .  కుటుంభ  వ్యవస్థను చక్క దిద్ద గలుగుతె అసలువ్యాజ్యాలే వుండవు.  

వ్యాజ్యాలే లేకపోతె,  అసలు  కోర్టుల అవసర మేముంటుంది, జడ్జీల అవసర మేముంటుంది, న్యాయ మూర్తుల అవసర మేముంటుంది,  లాయర్ల  అవసర మేముంటుంది , పోలీసుల    అవసర మేముంటుంది,  జైలుల  అవసర మేముంటుంది.

సమస్య ఎదైనా పరిష్కారం తప్పకుండా వుంటుంది. సమస్య ఒకటే అయనా కారణాలు అనేకంగా ఉండవచ్చు. టేక్నోలోజీ ఎంతో అభివృద్ధి చెందింది. మొదట ఆ కారణాలను వర్గీక రించాలి. విశ్లేషించాలి. ఇలా చేస్తే   బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ,

1.అసలు కేసులు ఎందుకు పెరుగుచున్నాయి, ఎలాంటి కేసులు ఎక్కువగా ఉంటున్నాయి, ఎలాంటి వారి వలన కేసులు పెరుగు చున్నాయి, కేసులు పెట్టడానికి పేరుక పోవడానికి కారణాలు ఏమిటి ? మొదలగు విషయాలను విభజించాలి, విశ్లేషించాలి.

2.సాదారణంగా కేసులు, ఆస్తులకు సంభందించినవి, మనష్యులు- మతాలకు సంభందించినవి,పశు పక్షాదులకు క్రిమి కీటకాదులకు సంభందించినవి , దేవుళ్ళకు సంభందించినవి, వృక్షాలు వాతావరణం అంతరిక్షానికి సంభందించినవి , దేశ భద్రతకు సంభందించినవి ఉండవచ్చు.

3.కేసుల పరిష్కారానికి గడువు అనేది నిర్దేశిస్తే  బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ,

4.చట్టాల గురించి, రాజ్యాంగం గురించి ప్రజలకు వారి వారి మాతృ భాషల్లో అవగాహనా కల్పిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.
 
5.కేసులను ఎలాంటివారు వేస్తున్నారు. న్యాయం
ధర్మం తెలిసి వేస్తున్నారా ? తెలియక వేస్తున్నారా? ఎవరి ప్రోద్భలంతో వేస్తున్నారు? మొదలగు విషయాలను విశ్లేషించాలి.

6.కేసులను పూర్తిగా కంప్యూతీకరణ  చేస్తే  కేసులు సత్వరం పరిష్కారం అవుతాయని  ప్రజలు కోరుకుంటున్నారు. ,

7.చట్టం ముందు అందరూ సమానులే అన్న భావనను ప్రజలలో కలిగించాలి.

8.ధనవంతులకు  ఒక రకంగా, పేద ప్రజలకు ఒక రకంగా శిక్షలు ఉండ కూడదు.

9.కోట్ల ఆస్తులను దోచి, విదేశాలల్లో దాచే వారిని వదిలి పెట్టి, కోట్లాది ఆస్తులను బినామీ ల పేర్లతో  దాచే వారిని వదిలి పెట్టి, పొట్ట  కూడు, గూడు కోసం చిన్న చిన్న దొంగ తనాలు చేసే వారిని జ్యేల్లో పెట్టడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలి. ప్రజలు చిన్న చిన్న అబద్దాలు ఆడటానికి, చిన్న చిన్న దొంగ తనాలు చేయడానికి కారణం ఆర్ధిక అసమానతలే కారణం అని  గ్రహించడానికి ఎంతో సమయం పట్టకూడదు.స్వాతంత్ర్యం వచ్చి 66 సంవత్చారాలయినా ప్రజలకు పొట్ట కూడు , గూడు కోసం అగచాట్లు తప్పడం లేదు. కాని 80 కోట్ల జనాభా పెరిగింది. లక్షల కోట్లు అప్పులు పెరిగాయి. దేశ సంపదంతా కేవలం 10 శాతం ప్రజల వద్దనే పేరుక పోవడానికి కారణం ఏమిటో విశ్లేషించు  కోవాలి . 

10. రాజ్యాంగం లోని నాలుగు ముఖ్య స్తంభాలయిన లెజిస్లేచర్, ఎక్జిక్యూటివ్ , జుడిష్యరీ మరియు ప్రెస్ విభాగాలలో జుడిష్యరీ ప్రత్యేక మైనది. దీని  పై రాజకీయ ప్రభావం ఉండ కూడదు.

11.జడ్జీలు, న్యా య  మూర్తులు చట్ట పరిధి లోని  తీర్పుల భావాలను ప్రజా  వేదికలపైనా / సభలల్లో వ్యక్త పరుస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. 
నీరు శంకు నుండి వస్తేనే అవి తీర్థంగా భావించి నట్లు , నిత్య సత్యాలు న్యాయ మూర్తుల నోటి నుండి వేలుబడుతేనే అవి ముత్యాలుగా మారుతాయి. నీరు శంకు నుండి వస్తేనే అవి తీర్థంగా భావిస్తారు. కోర్టులకు వెలితే  ఆ కేసు తేలే వరకు కొన్ని  సం . రాలు  ఖచ్చితంగా  పడుతుంది . ఇరు వర్గాలకు  ఖర్చు  తడిసి మోపెడు  అవుతుంది . అందుకని  " కోర్టులో  ఓడిన  వాడు  కోర్టులో ఏడిస్తే , గెలిచిన  వారు ఇంటికి వచ్చాక  ఏడుస్తారు " అనే   నగ్న సత్యాన్ని , విశ్రాంతి  జడ్జీలు , న్యాయ మూర్తులు , న్యాయ వాదులు ,  ప్రజలకు   అవగాహన  కల్పించాలి . 

ఆ విదంగా విద్యార్థులలో, ప్రజలలో  కోర్టులపై అవగాహన  కల్పించాలి. ప్రసిడెంట్, ప్రదాన మంత్రి, న్యాయశాకా మంత్రి, హొమ్ మంత్రి, గవర్నర్లు, న్యా య వ్యాదులు, ప్రజలు,  విద్యార్థులు మొదలగు వారితో తప్పా రాజకీయ నాయ కులతో సభలు జరుప కూడదని  ప్రజలు కోరుకుంటున్నారు. ఎక్కడ బహుమతి గాని , అవార్డు గాని  తీసుకో కూడదని  ప్రజలు కోరుకుంటున్నారు . 

12. కేవలం  న్యాయ వాదుల  వాదనల పైననే  ఆధార పడకుండా , కేవలం  ప్రభుత్వ  ప్రాసిక్యూటర్ పైననే  ఆధార పడకుండా , పాలకుల పలుకు బడికి ,  ప్రత్యక్ష , పరోక్ష బెదిరింపులకు భయ పడకుండా ,  చట్టాలకు కూడా ఒక ప్రత్యేకమైన నేరపరిశోధన సంస్థ  వుంటే  బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. 

13.సాక్షాలు , రుజువుల మీదనే ఆధార పడకుండా , కేవలం రెండు మూడు యేండ్ల లోనే  వేల కోట్లు ఎలా సంపా దించారు అనే విషయాన్ని దృష్టిలో వుంచుకుని, కేవలం వాటిపై పన్నులను మాత్రమె కాకుండా ,వారి పూర్తీ ఆస్తులను రికవరీ చేసి ప్రభుత్వాలకు జప్తు  చేసి , వారి పైన  తగిన చర్యలు తీసుకుంటే , పేద మద్య తరగతి ప్రజలు తప్పు చేయడానికి భయ పడుతారు. ఆ విదంగా కోర్టులలో కేసులు తగ్గి పోతాయని  ప్రజలు భావిస్తున్నారు .

14.పేదలు తమ పొట్టకూడు కోసం చేసే తప్పులను, పలుకుబడి గలవారు కొన్ని కోట్ల పేదల కడుపు కొట్టి , రేపటి వారి తర తరాల వారసుల కోసం దోచుకునే నేపధ్యం గల వారి తప్పులను ఒకే విదంగా చూడ కూడదని, ఒకే విధమైన శిక్షలు వుండ కూడదని  ప్రజలు కోరు కుంటున్నారు.

15.నేడు కోర్టులలో వున్నా కేసుల పూర్వ పరాలు పరిశీలించి, చిన్న చిన్న కేసులను బయటనే పరిష్క రించుకునే విధంగా నిభందలను విధిస్తే, కోర్టులలో కేసులు చాలా వరకు తగ్గి పోతాయి. ఇక ముందు  కూడా చిన్న చిన్న కేసులను కోర్టుల వరకు రాకుండా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తే  కోర్టులపై   చాలా వరకు భారం తగ్గు తుంది.


16.రూ.లు .25/- లాంటి కేసులకు   25 ఏండ్లు పడుతే , వేల కోట్ల కుంభ కోణాల  కేసులు పక్క దారి పడితే  పేద ప్రజలు కూడు, గుడ్డ మరియు  నీడ కోసం అల్లాడి పోతారు. దేశంలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడుతుంది. ప్రపంచంలో మన దేశం మసక బారు తుందని ప్రజలు భావిస్తున్నారు.        రాత్రికి  రాత్రే ఏదో మార్పు జరుగ గలదు అని ఎవరు  భావించడం లేదు. వేయి  అడుగుల    ప్రయాణమైనా మొదటి అడుగు తోనే ప్రారంభ మౌతున్దన్నట్లు, కనీసం మార్పు అనేది ప్రారంభమౌతే, ఓ దశాబ్దాని కైనా పూర్తీ మార్పు జరుగ గలదు.


17.పెద్ద పెద్ద కుంభ కోన దారులకు,  అవినీతి పరులకు, భినామి దారులకు  శిక్షలు వేస్తూ, పేద మధ్య తరగతి ప్రజలలో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేయాలి.పెద్దవాడే తప్పు చేసే, మనం చేస్తే తప్పేంటి అనే భావనను ప్రజలలో కలగా కుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.


18.నీతి నిజాయితీ పరులకు, సహృదయులకు, ధాతలకు సమాజంలో మంచి గుర్తింపు, ప్రోత్సాహం,సముచిత స్థానం మరియు రక్షణ కల్పించాలని ప్రజలు కోరు కుంటున్నారు.


19.అనవసరంగా  చీటికి మాటికి కోర్టులకు వెల్తే, ఓడిన వారు కోర్టులో ఏడిస్తే , గెలిచిన వారు  ఇంటికొచ్చి ఏడుస్తారు . ఎందుకంటే కాలయాపన ,వృధా డబ్బు ఖర్చు ,అప్పుల పాలవడం ,సంతోషాలు  హరించుకు పోవడం కక్షలు పెరుగడం ,సమాజంలో చిన్న చూపు ,ఇతర అభివృద్ధి పనులపై దృష్టి కేంద్రీకరించ లేకపోవడం ,మానసికంగా క్రుంగిపోవడం ,ఈలోపే జీవితం సగం గడిచి పోవడం, మరణానికి దారి తీయడం మొదలయిన వాటి నన్నింటిని  ప్రజలలో అవగాహన కల్గించ గలగాలి.



20.పేదలకు ఉచిత న్యాయ సేవలను అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.



21.న్యాయ సలహా కమిటీ లల్లో  అనుభవం గల పేదల , అట్టడుగు జాతి వారి   సూచనలను కూడా పరిగణ లోకి తీసుకుంటే న్యాయ వ్యవస్థ మరింత  రాని స్తుందని   ప్రజలు  భావిస్తున్నారు.

 
22.వ్యవస్థల్లో మార్పులు జరుగాలి. నేడు దేశంలో ఆదాయ పన్నుల సంస్థలు, ఆదాయం మీద పన్నులు చేల్లిస్తున్నారా లేదా  అని మాత్రమె చూస్తున్నారు తప్పా, వీరికి  అసలు ఆ ఆదాయం ఎలా వచ్చింది అనే దానిపై దృష్టి పెట్టడం లేదు. అలానే ఎక్షైజ్  డిపార్టుమెంటు అధికారులు  , సేల్స్ టాక్స్ డిపార్టుమెంటు అధికారులు , మున్సిపాలిటీల  అధికారులు, కార్పోరే సన్ల  అధికారులు మొదలగు వారు. తెల్లవారే సరికి కోట్లకు పడగలెత్తే  వారి పై  ఏ అధికారులు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఆ కారణంగానే  సంపదంతా కొందరి వద్దనే కేంద్రీక  రించ బడి, నల్ల ధనంగా మారు తుండటం వలన,  పేదలు  మరింత పేదలుగాను, ధన వంతులు మరింత ధన వంతులు గాను ఎదిగి పోతున్నారు. ఆ కారణంగానే  జీవన  విధానంలో సమస్యలు పెర్గి, కోర్టులలో  కేసులు పెర్గి పోతున్నాయి.      

రాత్రికి  రాత్రే ఏదో మార్పు జరుగ గలదు అని ఎవరు  భావించడం లేదు. వేయి  అడుగుల    ప్రయాణమైనా మొదటి అడుగు తోనే ప్రారంభ మౌతున్దన్నట్లు, కనీసం మార్పు అనేది ప్రారంభమౌతే, ఓ దశాబ్దాని కైనా పూర్తీ మార్పు జరుగ గలదు. "సర్వే  జనః  సుఖినో భవంతు".


నోట్  : నా  ఆలోచనలు  కేవలం  కేసుల  సత్వర  పరిష్కారానికి  మరియు కోర్టులలో కేసులను తగ్గించ డానికి , ప్రజల మరియు దేశ శ్రేయస్సు కోసరం  మాత్రమే. తప్పులుగా అనిపిస్తే క్షమించాలి.  



రోడ్డు రవాణా సంస్థల్లో (ROAD TRANSPORT CORPORATION) లాభాలు మెరుగు పరుచడానికి ఏమైనా ఉపాయాలు ఉన్నాయా ?


ప్ర : రోడ్డు రవాణా  సంస్థల్లో ( ROAD TRANSPORT CORPORATION) లాభాలు మెరుగు పరుచడానికి  ఏమైనా  ఉపాయాలు ఉన్నాయా ?


SOLUTIONS: "IDEAS TO IMPROVE  THE PROFITS IN ROAD TRANSPORT CORPORATION "

పరిష్కారాలు : " రోడ్డు రవాణా  సంస్థల్లో  లాభాలు మెరుగు పరుచడానికి  ఉపాయాలు "

” PASSENGERS ARE THE ‘GODS’ TO THE TRANSPORT CORPORATION”

రోడ్డు రవాణా  సంస్థకు ప్రయాణికులు  దేవుళ్ళు "

YES,  PASSENGERS ARE THE SERVICE UTILIZERS, INCOME IMPROVERS ,  WELL WISHERS, GUIDERS AND HENCE THEY ARE ONLY THE  ‘GODS’ TO THE TRANSPORT CORPORATION TO RUN  IN PROFITABLY, SO,  TRANSPORT  CORPORATION  MUST CONSIDER THE FOLLOWING STEPS TO IMPROVE FURTHER:

అవును  ప్రయాణికులు,   సేవలను  ఉపయోగించు కునే వారు,   ఆదాయాలను  పెంచే వారు . అభివృద్ధిని కాంక్షించే  వారు , సూచనలను  చేసే వారు . కనుక  రోడ్డు రవాణా సంస్థ  లాభాలలో నడవాలంటే ప్రయాణికులు మాత్రమే రోడ్డు రవాణా సంస్థ కు  దేవుళ్ళు . అందుకని  రోడ్డు రవాణా  సంస్థ  మరింత అభి వృద్ధి  సాధించాలంటే , లాభాల బాట పట్టా లంటే ,  కొన్ని విధానాలను  తప్పకుండా  పరిగణలోకి తీసుకుని , వాటిని అమలు పరచాలి .  

First step:

The Intention  of the management should be clear, open and transparent to run the Organisation smoothly and  Profitably.


 మొదటి  ప్రాధామ్యం :

రోడ్డు రవాణా  సంస్థ  సాఫీగా మరియు  లాభాలలో  నడవాలంటే , యాజమాన్యం ఉద్దేశ్యం పరిశుద్ధముగా  మరియు లక్ష్యం  బలంగా  ఉండాలి.  దాపరికం లేకుండా  మరియు పార దర్శకంగా   ఉండాలి . చెప్పేది  చేసేది రెండూ ,  ఒకటే అయి  ఉండాలి . అది గుండె నుండి రావాలి . ఎదో  ఒక  మార్పును  తీసుకుని రావాలనే  తపన ఉండాలి .  


Second step:

Appoint well qualified ,experienced,trusted and ethically capable persons in the key posts. So that they can concentrate on every aspect  of organisation. viz.,Buying , Selling of products, spare parts, recruitment, maintenance and running the organisation , properly.

రెండవ ప్రాధామ్యం : 

కీలకమైన  పదవులలో  అనుభవం ఉన్న వారిని , బాగా చదివిన వారిని , నీతి నియమాలకు కట్టుబడి ఉన్న వారిని , నమ్మకమైన వారిని ,  సమర్థులను నిస్వార్ధంగా , నిస్పక్ష పాతంగా  నియమించాలి . అలానే వారిపై  నమ్మకం  ఉంచాలి , సరియైన  వేతనాలు  చెల్లించాలి , సదుపాయాలు  కల్పించాలి , గుర్తింపు నివ్వాలి . గౌరవమివ్వాలి .హోదా ఇవ్వాలి . సదుపాయాలు  కల్పించాలి . ఫ్రీడమ్ ఇవ్వాలి . వారిచ్చిన  రిపోర్టులపై  తక్షణమే  ఉన్నతాధికారులతో  , ప్రభుత్వాలతో చర్చించి  తగిన నిర్ణయాలు తీసుకోవాలి . లేదా  ఎందుకు జాప్యం జరుగుతుందో వివరించాలి . అప్పుడే  వారు  రోడ్డు రవాణా  సంస్థ  లో జరిగే ప్రతి విషయాన్ని  క్షున్నంగా  పరిశీలిస్తారు . ప్రతి నిమిషాన్ని  వృధా  చేయ కుండా  శ్రమిస్తారు .  అవి , డీజిల్ , స్పేర్ పార్ట్శ్ , బస్సులు కొనుగోళ్లు కావచ్చు , స్క్రాప్  అమ్మకాలు కావచ్చు , నియామకాలు కావచ్చు , బస్సుల రిపేర్లు కావచ్చు . ప్రయాణికుల సేవలు కావచ్చు , మిగులు స్థలాలను సద్వినియోగం చేసుకోవడం కావచ్చు , మరేదయినా కావచ్చు . 


Third step:

To control the  passengers rush  at bus stops in major cities, it is more essential to increase further the short route shuttles.  To atract more passengers , put " SHUTTLES'' name plates. these shuould be visible even in nights also . The buses should be coloured in special shades. So that most of the passengers will be distributed to different places without any traffic problems. Besides to that  long route buses also should be continued for every 5 mts. then , there will not be any huge rush in the buses and passengers will travel safely.

మూడవ ప్రాధామ్యం : 

ముఖ్యమైన  కూడళ్లలో , పట్టణాలలో  ప్రయాణికుల ఇబ్బందులను, సమస్యలను తగ్గించడానికి తక్కువ దూరం గల   " షటిల్స్ " ప్రారంభించాలి . బస్సులపైన  ఆ విధంగా  " షటిల్స్ " బోర్డులు పెట్టించాలి .  అవి అందరికి కన బడే విధంగా ఉండాలి . వాటికి ప్రత్యేకమైన రంగులు వేయాలి .  ఆ విధంగా  ఎక్కువ మంది   ప్రయాణికులు , షటిల్స్ లలో  వెళ్లడం వలన  ట్రాఫిక్ సమస్య  తగ్గిపోతుంది . అదే విధంగా  ఎక్కువ దూరం ప్రయాణం చేసే బస్సులను కూడా  ప్రతి 5  నిమిషాలకు  ఒకటి చొప్పున                  ( అవసారాను బట్టి )  కంటిన్యూ  చేయాలి .  ఈ విధంగా చేయడం వలన  రద్దీ తగ్గి పోయి  , ప్రయాణికులు  హాయిగా  ప్రయాణం చేయడానికి  వీలు కలుగుతుంది . 


Fourth step:

Just counsel the drivers and conductors to maintain good relationship with the passengers. And give free hand to the controllers and drivers and conductors to run the buses at the convenience of the passengers. Stopping of buses at bus stops,  running of the buses at nearest to the bus bays , maintenance of gap from bus to bus, maintain co ordination  among all types of drivers etc., So give free hand to drivers to maintain some gap from one bus to another bus,where ever possible. If the  drivers can not stop the buses in bus stops , must impose the penalties.Penalties should be just punishment but not treat as a RTC income.  Arrange more buses in the morning and evening times . Seasonally , give more concessions to attract more passengers.Then rush will increase in the  buses and profits will increase  to the organisation. 

Besides to that every day the Passengers and the Coductors are facing  lot of problems like fighting , quarrelling, Crying and  some times stopping the Buses in middle  etc ., is due to simple " Change Money ( Balance Money) " By seeing it looks like  small & simple. But every day and in evry bus it is a big issue. To solve this problem, there is  good ideas.  01. Simply alter the ticket charges to nearest Rs.5/-, 10/- , 15/- , 20/-  and 25/- etc., 02. Provide more change to the Conductors and provide the fascility to the conductors to get the change at every big bus stops, if required. 03. In addition to that issue the tokens for the balance money and allow the passengers to  en cash the amount with the tokens at evry Bus pass issue ceteres and to further to accept  the Conductors to travel in other Buses in different routes. 


నాల్గవ ప్రాధామ్యం :

రవాణా సంస్థలకు  దేవుళ్లతో  సమానమైన  ప్రయాణికులతో  ఎలా మెదులు కోవాలో  , వారితో  ఎలా మంచి సంభందాలు  ఏర్పరుచుకోవాలి  , ఎప్పటికప్పుడు  డ్రైవర్లకు  , కండక్టర్ల కు , కంట్రోలర్లకు  మరియు ఇతర ఉద్యోగులకు  సూచనలు చేయాలి . సలహాలు ఇవ్వాలి . అలానే కొంతమంది  నమ్మకమైన  , సమర్థులైన  కంట్రోలర్లకు , డ్రైవర్లకు , కండక్టర్ల కు  , ప్రయాణికుల రద్దీని  బట్టి , ప్రయాణికులకు అనుకూలంగా ,  బస్సులను నడిపే విధంగా  ఫ్రీడమ్ ఇవ్వాలి .  దీని వలన  ఎంతో డీజిల్ ఆదా అవుతుంది . ప్రయాణికులు హాయిగా ప్రయాణం చేస్తారు . ప్రయాణికులు  ఆటోల కోసం , క్యాబు   కోసం  పరుగెత్తరు . ప్రయాణికులకు  ఆర్ టీ  సి  పై నమ్మకం  పెరుగుతుంది . ఆ విధంగా ఆదాయం పెరుగుతుంది . ప్రతి బస్సును  బస్  స్టాప్  లలో , బస్  బే లలో  ఆపే  విధంగా కట్టడి చేయాలి .  బస్సులను ఆపని డ్రైవర్లకు  పెనాలిటీలను విధించాలి . అయితే  ఆ పెనాలిటీలు  వారిలో మార్పు కోసమే  అయి  ఉండాలి  గాని , ఆర్ టీ  సి కి  ఆదాయముగా ఎంచరాదు . ప్రయాణికుల రద్దీని బట్టి  ఉదయం  , సాయంత్రం  ఎక్కువ బస్సులు  , మధ్యాహ్నం తక్కువ బస్సులు నడపాలి . పండుగలు , పబ్బాలు , పరీక్షలు , పెళ్లిళ్లు , పుష్కరాలప్పుడు బస్సులను  ఎక్కువగా నడపాలి .  ఈ విధంగా  మార్పులు చేయడం వలన    ప్రయాణికులకు  ఆర్ టీ  సి పై నమ్మకం  పెరుగుతుంది . క్రమేణా రద్దీ పెరుగు తుంది . ఆ విధంగా  ఆర్ టీ సి కి ఆదాయం పెరుగుతుంది . 


అదియును గాక ప్రతి రోజు  ప్రయాణికులు , కండక్టర్లు  ఎదుర్కునే  సమస్య , కొట్లాడుకునే సమస్య , కొట్టుకునే సమస్య , ఇతర ప్రయాణికులకు  ఇబ్బంది కలిగే సమస్య , ఒక్కో సారి బస్సులను ఆపి వేసే సమస్య " చిల్లర సమస్య " . చూస్తే  ఇది చిన్నదే . కానీ  అనుభవించిన ప్రయాణికులకు , కండక్టర్లకు   తెలుస్తుంది  దీని ప్రభావం  ఎంతో . నష్ట పోయే ప్యాసింజర్లే  ఎక్కువగా కనబడుతారు .ఈ సమస్యకు చక్కటి  పరిష్కారాలున్నాయి . అవి , 01. బస్సు చార్జీలను  రూ లు  5/-, 10/- ,15/- , 20/-,25/- కి  దగ్గరగా  మార్చాలి . 02. కండక్టర్లకు  ఎక్కువ  చిల్లరను అందించాలి . ప్రతి పెద్ద బస్సు స్టాప్ లలో , కండక్టర్లు చిల్లరగా మార్చుకునేందుకు  అవకాశం కల్పించాలి . 03.  వీటికి అదనంగా  టోకెన్లను జరీ చేయాలి . మరియు  అవి  ప్రతి  పెద్ద  బస్సు పాస్ సెంటర్లలో  నగదుగా మార్చు కునేందుకు   మరియు / లేదా  ఇతర ప్రాంతాలకు  వేరే బస్సులలో అవే  టోకెన్లతో  ప్రయాణం చేసేందుకు  అవకాశం కల్పించాలి . 

Fifth step:

Concentrate on competitors.  competitors are  other sector  buses, SETWIN  buses, Autos, Cabs etc. If the corporation is able  to provide more facilities to the passengers , Passengers can not try for  Autos,Setwin buses and Cabs.If we observe closely, SETWIN buses always  run with heavy rush. But we can not find that much rush in the buses or in the mini buses all the times. Because ,SETWIN bus people  will wait at every bus stop and call the passengers and guide them where they have to get down.  Generally, passengers desire  " SPEED, SECURITY, SAFETY, RUSH FREE, CONVENIENT , STOPPING BUSES NEAREST TO THE OTHER CITY/ SUBURBAN BUS  STOPS  & RAIL WAY STATIONS  AND  LOW CHARGES " Hence, must  introduce the Mini Buses to go every nook & corner of the city and  stop the Buses, where ever  the passenger show the hand. Because ,their intention is to increase the occupancy and to  earn more profits.  Passengers are the Gods to the any transport corporation. So take the suggestion and ideas from the passengers and implement  at appropriate time and then watch the result. Issue the quarterly ,half yearly and yearly bus passes on passengers request. After verification only ,students are submitting the bus pass applications along with evidences. So the  organisation arrange to issue the students Bus passes with in minuts only. Encourage the passengers for the valuable ideas with free gifts and cash awards.

ఐదవ ప్రాధామ్యం :

పోటీ దారులపైన  దృష్టి పెట్టాలి . పోటీ దారులంటే  ప్రయివేటు బస్సులు , సెట్విన్ బస్సులు , ఆటోలు , క్యాబులు , రైళ్లు , పడవలు  మొదలైనవి . అవి రోజు రోజుకు మూడు పువ్వులు ఆరు కాయలు గా , ఎలా ఎదుగు తున్నాయో  అర్ధ చేసుకోవాలి . ప్యాసెంజర్లు ఆటోలను , క్యాబులను , ప్రయివేటుబస్సులను , రైళ్లనే ఎందుకు ఆశ్రయిస్తున్నారో తెలుసుకోవాలి .    కారణాలు ఏమిటో విశ్లేషించుకోవాలి .ప్యాసెంజర్ల  సలహాలను , సూచనలను  స్వీ కరించాలి. ప్యాసెంజర్లను  అడిగి తెలుసుకోవాలి . వాటికీ అనుగుణంగా సరియైన  చర్యలు చేపట్టాలి . ప్యాసెంజర్లకు  సరియైన  సదుపాయాలు కల్పించాలి . బస్సు షెల్టర్ల్  కావచ్చు , టాయిలెట్స్ కావచ్చు . సీటింగ్స్ కావచ్చు , ఫాన్స్ , లైటింగ్  కావచ్చు . బస్సుల టైమింగ్స్ ,  ప్రయాణికులకు గైడ్స్  మరియు  ఆయా నియమాలను పాటించడం  మొదలైనవి . 
ప్యాసెంజర్  ఎక్కడ  చెయ్యి లేపి ఆపమన్నా , ఆపే  విధంగా డ్రైవర్లకు , కండక్టర్లకు  సూచనలు చేయాలి .  సాధారణంగా  ప్యాసింజర్లు  ఏమి కోరుకుంటారంటే , " వేగం , రక్షణ  స్వేచ్ఛ , అధిక రష్  లేక పోవడం , అనుకూలత, ఇతర సిటీ/ సబర్బన్  బస్ స్టాప్ లకు , రైల్వే  స్టేషన్లకు  చేరువలో ఆపడం   మరియు  తక్కువ చార్జీలు"  అందుకని , ప్రతీ  వీధి  మూలలకు  వెళ్లేవిధంగా  మినీ బస్సులను ప్రవేశ పెట్టాలి .   బస్సుల్లో ఆక్యుపేషన్  పెంచాలనే ఉద్దేశ్యం డ్రైవర్లకు , కండక్టర్లకు కలుగ చేయాలి . ఏ రోడ్డు రవాణా సంస్థ కయినా  ప్యాసింజర్లే  దేవుళ్ళు . అందుకని  వారి సలహాలను , సూచనలను  సేకరించాలి . హంసల్లాగా  మంచి వాటిని ఇంప్లి మెంట్  చేయాలి . మిగిలిన వాటిని  పరిశీలనలో  పెట్టాలి .  విద్యార్థులకు  మరియు  ఇతర ప్యాసింజర్లకు  నెల వారీ , మూడు నెలల వారీగా , ఆరు నెలల వారీగా  బస్ పాస్ లను జారీ  చేయాలి . విద్యార్థుల బస్  పాసులను 15 నిమిషాలలో జారీ చేసే విధంగా  యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి . టెక్నాలజీని  ఉపయోగించు కోవాలి .  డెబిట్ , క్రెడిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లో  తీసుకునే విధంగా ఆప్ లను  తయారు చేయాలి .  మంచి మంచి  సలహాలకు , సూచనలకు , బహుమతులతో , నగదు  అవార్డ్స్  తో  ప్యాసింజర్లను  ప్రోత్సహించాలి . 


Sixth step:

Concentrate to utilize the  fixed assets, Buildings and variable assets to earn additional income.
If the any transport organisation takes the above steps at appropriate time, again it will turn into profits with in a short period.

ఆరవ ప్రాధామ్యం :

స్థిర  ఆస్తులను అనగా  బిల్డింగులు, ఖాళీ స్థలాలు , మడిగెలు  మరియు ఇతర  ఆస్తులను , అదనపు ఆదాయము  వచ్చే  విధంగా  , సరియైన విధంగా  ఉపయోగించుకోవడం పై దృష్టిని సారించాలి .  ఈ విధంగా చేయడం వలన , అతి కొద్దీ సమయం లోనే  లాభాలు కనబడుతాయి . 


Seventh step:

Try to implement  latest and  new schemes/services time to time to attract  all the passengers and also give the chance for  the young  generation suggestions and ideas.

ఏడవ ప్రాధామ్యం :

అన్ని రకాల  ప్యాసెంజర్లను  ఆకట్టుకోడానికి , ఎప్పటికప్పడు  క్రొత్త క్రొత్త  స్కీమ్ లను , సర్వీసులను ప్రవేశ పెట్టె ప్రయత్నం చేయాలి . 

Eighth step:

Must see that to provide better amenities to the passengers. Ex: Water , Shelters, Toilets , Wash rooms, Wall clocks, Fans, Eatable items at lower cost, Easy Tickets booking facilities , Bus pass issuing facilities , Entertainment facilities  and others time time may be identified. And also , must arrange route boards on buses , front side , back side and entrance side etc., to easily identify by the passengers in the nights also.  Must provide guides  where ever trafic is more. 

ఎనిమిదవ ప్రాధామ్యం :

ప్యాసింజర్స్ కు  తప్పనిసరిగా  సరియైన  సదుపాయాలను  కల్పించాలి . ఉదా :  త్రాగు నీరు , బస్సు స్టాపులు ,  ఉచిత మల మూత్ర శాలలు , గోడ గడియారాలు ,  ఫ్యాన్లు , తక్కువ ధరలకు  టీలు , తిను బండారాలు , కరెంటు , టికెట్ బుకింగ్  సదుపాయాలు , సులువుగా  బస్సు పాస్  పొందే సదుపాయాలు , ఎంటర్టైన్  మెంట్  సదుపాయాలు , వై ఫై మొదలైనవాటిని  కల్పించాలి . అలానే  ప్యాసింజర్లకు  రాత్రి సమయాలలో  కూడా కనపడే విధంగా  రూట్ బోర్డులను  బస్సుల ముందు భాగాన ,  వెనుక భాగాన , ప్రక్క భాగాన  పెట్టాలి . రద్దీ బస్సు స్టాప్ లలో  గైడ్ లను  నియమించాలి .  

Nineth step:

Must concentrate on cost reduction and cost control . For example, while purchasing Buses , or while calling tenders etc., there must be transparent. Diesel consumption, unauthorized salaries and Wages, Spare parts purchase, Sale of scrap etc., To reduce the travelling routes , where ever trafic is low, use short cut routes to reduce the the diesel cost. Must concentrate on utilization of RTC buildings and spaces by giving rents or lease , By reducing administration cost where ever possible,  imposing huge penalties  for miss using of Bus passes and Ticket less travelers / passengers / students etc.,

తొమ్మిదవ ప్రాధామ్యం :

ధరలను తగ్గించడం లో , వృధా ఖర్చును  కంట్రోల్  చేయడం పై తప్పని సరీగా  దృష్టిని సారించాలి . ఉదా : క్రొత్త బస్సులను కొను నపుడు , టెండర్లు పిలుచునపుడు  పారదర్సకత  ఉండాలి . బస్సుల రిపేర్లు , డీజిల్  వినియోగం , అనధికారిక  జీతాలు , వేతనాలు , స్పేర్ పార్ట్స్  కొనుగోళ్లలో  , స్క్రాప్ అమ్మడంలో నియంత్రణ  పెంచాలి  . ప్రయాణ  రూట్ల  దూరాలను , ట్రాఫిక్ తక్కువ ఉన్న చోట , డీజిల్ ఖర్చును   తగ్గించుకునే విధంగా  షార్ట్ కట్ రూట్లను ఎంచుకోవాలి . ఆర్ .టి.సి.బిల్డింగులను , ఖాళీ స్థలాలను , సైన్ బోర్డులను  కిరాయిలకు లేదా లీజులకు  ఇచ్చి అదనపు ఆదాయాన్ని  పొందాలి . అలానే  ఎక్కడ వీలైతే అక్కడ  అడ్మినిస్ట్రేషన్ ఖర్చులను  తగ్గించాలి .  బస్సు పాస్ లను మిస్ యూజ్  చేసిన  వారికీ  అధిక పెనాలిటీలు విధించాలి . 


Tenth Step:

The Govt. concerned must compansate  to the RTC , what ever amount , the RTC is loosing by way of "Free Bus passes" , "Concessional Passes" and other General passes issued to the Passengers  and Students  and  running the buses to the students at free of charges  etc., This may be  about Rs.800/- Crores to Rs. 1,000/- Crores, every year. Must co operate and co ordinate with the different Govt. Departments. Viz., GHMC, Police Department, Electricity Department and others. Saying  that the RTC is losses is vague , when the buses are  running with 'skin tight' passengers, 

పదవ ప్రాధామ్యం :

ప్రతి సంవత్సరం  ఆర్ . టి . సి ,  ఉచిత బస్సు పాసుల మూలంగా ,  ప్యాసింజర్లకు జారీ చేసే  బస్సు  పాసుల వలన  , కన్సీషన్  రూపంలో  మరియు  విద్యార్థులకు ఉచితంగా నడిపే  బస్సుల వలన  నష్ట పోయే  మొత్తాన్ని , సంభందిత  ప్రభుత్వాలు , ఆర్ . టి . సి  కి  చెల్లించాలి . ప్రతి సంవత్సరం ఇది  సుమారుగా రూ . లు . 800/- కోట్ల నుండి 1,000/- కోట్లు ఉంటుందని అంచనా . ముఖ్యంగా  వివిధ ప్రభుత్వ  విభాగాలతో  సత్సంభందాలు , సహకారాలు  వుండేట్లుగా చూసుకోవాలి . ఉదా : జి . హెచ్ . ఎం సి ., పోలీస్ డిపార్ట్మెంట్ , ఎలిక్ట్రిసిటీ  డిపార్ట్మెంట్  మరియు ఇతర ప్రభత్వ సంస్థలు . బస్సులు 'కిక్కరిసిన ' (SKIN TIGHT) ప్రయాణికులతో  నడుస్తుంటే  రోడ్డు రవాణా సంస్థ  నష్టాలలో ఉందనడం  హాస్యాస్పదం . 

When we  impliment the above plans and suggestions , then we can not listen or see any losses in  the RTC, in any year. We will see  only the profits.

పైన  సూచించిన  విధానాలను  అమలు చేసినట్లవుతే , మనం  ఆర్ టి సి  లో ఎలాంటి నష్టాల గురించి  వినం ,  చూడం . ప్రతి సంవత్సరం లాభాల గురించే వింటాం , చూస్తాం . 


All the success! Best of luck!


అంతా విజయమే జరుగుగాక ! అదృష్టం వరించు గాక !

www.sollutins2all.blogspot.com