" జన్ ధన్ యోజన " (JAN DHAN YOJANA) పథకం సంపూర్ణంగా విజయ వంతం కావాలంటే ఏమి చేయాలి?
1. రాజ్యాంగ పరమైన " విద్యా హక్కును " , సంపూర్ణంగా , మనః స్పూర్తిగా అమలు చేయాలి .
2. బ్యాంకు వ్యవహారాలపై , ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి .
3. కొన్ని బ్యాంకులను కలిపేయాలి . మరియు బ్యాంకుల బ్రాంచులను ప్రతి గ్రామం లో ఉండేటట్లు చోరువ తీసుకోవాలి .
4. బ్యాంకు ఆఫీసర్లు , సిబ్బంది ' కస్టమర్ ఫ్రెండ్లీ " గా వ్యవహ రించాలి .
5. ప్రజలకనుగునంగా , బ్యాంకుల సమయాలను మార్చాలి .
6. ప్రతి అకౌంట్ కు , నామినీని మ్యాన్డేటరీ చేయాలి . వారి పూర్తి అడ్రస్ లు , ' ఆధార్ కార్డు ' నెంబరును , ' పాన్ కార్డు ' నెంబర్ ను, సెల్ నెంబర్లు రిజిస్టర్ చేయాలి మరియు వీటిని అనుసంధానం చేయాలి . అనుకోని సంఘటనలు జరిగి నప్పుడు , ఎలాంటి కొర్రీలు లేకుండా , అకౌంట్ లోని బ్యాలన్స్ అమౌంట్ , నామినీకి చెల్లించే ఏర్పాటు చేయాలి . అప్పుడే మోసాలు జరుగ కుండా , నల్ల ధనం కూడ బెట్టకుండా , పన్నుల ఈగ వేతలు లేకుండా ఉంటాయి .
7. ప్రజల సొమ్ముకు పూర్తి భద్రత కల్పించాలి .
8. సర్వీస్ చార్జీలను తగ్గించాలి . సర్వీస్ పన్నును పూర్తి గా ఎత్తి వేయాలి .
9. ప్రజలను మానసికంగా నగదు రహిత విధాన మార్పుకు సిద్ధం చేయాలి . ప్రజలకు , ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు నగదు అనేది , దీపానికి కందెన లాంటిది .
10.నిరంత రాయంగా ఇంటర్ నెట్ ను అందించ గలగాలి .
11. బ్యాంకింగ్ సర్వీసులు సులువుగా , ప్రజలకు అందుబాటులో ఉండాలి .
బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయడం , ఏ .టి . ఎం . మెషీన్లు , స్వఇపింగ్ మెషీన్లు అధికంగా , అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలి .
అప్పుడు మాత్రమే " అర్ధ క్రాంతి " పధకం విజయ వంతం అవుతుంది .
No comments:
Post a Comment